సీఎం కేసీఆర్ చేసింది.. రెండే రెండు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చాక రెండే రెండు పనులు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకటి ప్రగతి భవన్ కట్టుడు.. రెండు సచివాలయం కూల్చుడు అన్నారు. ఇంతుకు మించిన ఆయన సాధించిదేమీ లేదని విమర్శించారు. మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్కు లేక్ సిటీ అనే గుర్తింపును నిజాంలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ నగర ప్రజలకు కేసీఆర్ భ్రమలు కల్పించారని చెప్పారు. వందేండ్లలో నగరం ఎంత ఆక్రమణలకు గురైందో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆరేండ్లలో అంత విధ్వంసమైందన్నారు. మెట్రో రైలుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఫోజులు కొట్టి పోటోలు దిగితే యజమానులు అయిపోతారా? అని నిలదీశారు.













