టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేస్తే… మేమూ సిద్ధమే
టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోళ్లపై రాజీనామా చేస్తే తాము సిద్దమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటులో టీఆర్ఎస్ మాట్లాడలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలకు స్వస్తి పలకాలని అన్నారు. రైతులకు కేసీఆర్కు నిజంగా ప్రేమ ఉంటే రూ.20 వేల కోట్లు కేటాయించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు కనీసం 10 గంటలు కరెంటు సరఫరా ఉండటం లేదంటూ విమర్శించారు. రాష్ట్రం ఆదాయం బాగా పెరిగిందని చెప్పే సీఎం, ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.













