ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేష్ గౌడ్ ఏకగ్రీవం
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు యునానిమస్‌గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్ గౌడ్, వెంకట్‌లకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.













