అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం.. అభ్యర్థులను
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఓవైపు ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్ఠానం రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. కౌంటింగ్‌కు ముందు అభ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండేందుకు అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ అభ్యర్థులందరినీ హైదరాబాద్ రప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని హోటల్ తాజ్ కృష్ణలో అభ్యర్థులకు ఏఐసీసీ ప్రతినిధులు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.













