కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం గ్రేటర్ ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. గ్రేటర్లో గెలిపిస్తే వరద బాధితులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు ఇస్తామంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణికం ఠాగూర్ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో నగర అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలను వివరిస్తూ పలు రకాల వరాలను ప్రకటించారు. గ్రేటర్లో గెలిస్తే ఉచితంగా 30 వలే లీటర్ల మంచి నీటిని అందిస్తామన్నారు.
మేనిఫెస్టోలోని ప్రధాన హామీలు :
వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేరుస్తాం. మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులు పాతబస్తీ, శంషాబాద్ వరకు విస్తరింపు. మెట్రో, ఎంఎంటీఎస్‌లో మహిళలు, వృద్ధులకు
ఉచిత ప్రయాణం. అర్హత కలిగిన అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు. 100 యూనిట్ల లోపు గృహాలకు కరెంట్ ఉచితం. 80 గజాలలోపు ఉన్న ఇళ్లకు ట్యాక్స్ రద్దు. జీహెచ్ఎంసీ లైబ్రరీలలో దివ్వాంగులకు ఉద్యోగాలు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లేకుండా చేస్తామని తెలిపింది. ధరణి పోర్టల్ రద్దు, ప్రతి కుటుంబానికి 30వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.













