గాంధీ పర్యటన… మరో ఉస్మానియా కాకూడదు

ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రి పర్యటన గతంలో ఉస్మానియా పర్యటన మాదిరిగా కాకూడదని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్యలు జరిపి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలన్నారు. కోవిడ్‍తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. గతంలో ఉస్మానియాకు వెళ్లిన కేసీఆర్ అర చేతిలో వైకుంఠం చూపించారన్నారు. ఆ హామీలు ఇప్పటికే నెరవేరలేదన్నారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచాలన్నారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటీవ్ ఇంత వరకు అతీగతీ లేదన్నారు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. కోవిడ్‍తో చనిపోయిన రోగులను కుటుంబాలను ఆదుకోవాలన్నారు.