ఆ అధికారం ఏఐసీసీకి తప్ప పీసీసీకి లేదు
తనకు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, అసలు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం ఏఐసీసీకి తప్ప పీసీసీకి లేదన్నారు. తనపై ఎందుకు కుట్రలు పన్నుతున్నారో అర్థం కావట్లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రచారానికి, తనకు సంబంధం లేదని అన్నారు. షోకాజ్ నోటీసు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలో ఖర్గేను కలిసిన తర్వాత తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని ప్రకటించారు.













