ఆ విషయం తెలిసి సోనియా తెలంగాణ ఇచ్చారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపు ఇచ్చారు. చౌటుప్పల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. 12 వందల మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే..ఆ విషయం తెలిసి..తట్టుకోలేక సోనియా తెలంగాణ ఇచ్చారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాగానే మునుగోడు నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు తాగునీరు అందిస్తామని అన్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభివృద్ధి పనుల్లో కమీషన్లు తీసుకుని కోట్ల రూపాయలు ఆర్జించారని విమర్శించారు. మహాకూటమికి ఓటు వేసి టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని అన్నారు.













