కాంగ్రెస్ లేకుండా దేశంలో ఏ ఫ్రంట్ సాధ్యం కాదు
దేశంలో కాంగ్రెస్ లేకుండా ఏ ఫ్రంట్ సాధ్యం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్ మార్చాలనడం సరికాదన్నారు. అంబేద్కర్ రాజ్యాగంతోనే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్ ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. కేసీఆర్ బీజేపీ మీదకు తుపాకీ పెట్టి కాంగ్రెస్ వైపు కాలుస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ కోతల రాయుడని ఎద్దేవా చేశారు. తెలంగాణకు నిధులు తెచ్చే విషయంలో నీ నర్కుడు ఏమైందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంంగాణ ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు.













