సీఎం కేసీఆర్ వెళ్తేనే లేని ఉపయోగం.. మంత్రులు వెళ్తే ఉంటుందా?
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తేనే లేని ఉపయోగం, మంత్రులు వెళ్తే ఉంటుందా? అని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఢిల్లీ పర్యటన పేరుతో మరో కొత్త డ్రామా మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. రైతులు, యువకులు, ప్రజలు కాంగ్రెస్ వైపు చూడకుండా టీఆర్ఎస్, బీజేపీ పన్ని కుట్ర ఇది అని అన్నారు. సీఎం కేసీఆర్ బ్యాక్ డోర్ నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. రాజకీయంగా బతకడానికి రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాని దుయ్యబట్టారు.
తెలంగాణ వచ్చాక ఇక ఉద్యమాల అవసరం ఉండదనుకున్నాం కాని స్వయం పాలనలో రైతులు రోడ్ల మీద, కేసీఆర్ ఏసీ గదుల్లో నిద్రపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు వడ్ల కొనుగోలు సమస్య లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వచ్చాక వడ్ల సమస్య సృష్టించిదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ రోజు ధర్నాల పేరుతో టీఆర్ఎస్ డ్రామాలు చేస్తోదన్నారు. సమస్యను పరిష్కరించాల్సి వాళ్లే ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బతుకులతో ఆడు కుంటున్నాయన్నారు.













