కరోనాను జయించిన కాంగ్రెస్ సీనియర్ నేత
కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ సీనియర్‌నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్ ఆయన సతీమణి పక్షం రోజుల చికిత్స అనంతరం ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత పక్షం రోజుల క్రితం ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనాను జయించి వీహెచ్ తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి చక్కబడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వీహెచ్‌కు కరోనా సోకినట్లు తెలియగానే కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. వీహెచ్ కరోనాను జయించి ఇంటికి చేరుకున్నారని తెలుసుకుని హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు.













