దొరలకు లాభం చేసేందుకే ధరణి : వీహెచ్
తెలంగాణ రాష్ట్రంలో దొరలకు లాభం చేసేందుకే ధరణి పోర్టల్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ధరణి ఎందుకు తీసుకొచ్చారో సీఎం కేసీఆర్కు అయినా తెలుసా? అని ప్రశ్నించారు. దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరా గాంధీ దేనన్నారు. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పేదల భూములను పెద్దలకు రాసిచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే లోపు ఉన్న భూములను మాయం చేస్తారన్నారు.













