తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి… ప్రకటించిన ఏఐసీసీ

కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠత రేపుతున్న తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపికను అధిష్ఠానం ఎట్టకేలకు పూర్తి చేసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా రేవంత్ రెడ్డికే అధిష్ఠానం పీసీసీ పగ్గాలు అప్పజెప్పింది. అయితే రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు వినిపించినా, చివరికి రేవంత్ రెడ్డి పేరే ఖరారైంది. పీసీసీ చీఫ్‌తో పాటు ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా ప్రకటించింది. అంతేకాకుండా 10 మంది ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్లను కూడా ప్రకటించింది.
పీసీసీ అధ్యక్షుడు : రేవంత్ రెడ్డి…
వర్కింగ్ ప్రెసిడెంట్లు : జె. గీతారెడ్డి, ఎం. అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, బి. మహేశ్ కుమార్ గౌడ్, హజారుద్దీన్
సీనియర్ ఉపాధ్యక్షులు : సంభాని చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పొందెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, జావెద్ అమీర్
ప్రచార కమిటీ చైర్మన్ : మధుయాష్కీ గౌడ్
ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ : దామోదర రాజ నర్సింహ