ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
త్వరలోనే తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాములు నాయక్ పేర్లను అధికారికంగా వెల్లడించింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ అభ్యర్థిగా రాములు నాయక్, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి అభ్యర్థిగా చిన్నారెడ్డి పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.













