రాచకొండ పోలీసులకు అమెరికా కాన్సులేట్ ప్రశంస
అమెరికా దౌత్య అధికారిణి కేథరిన్ హడ్డా రాచకొండ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు తన ట్విటర్లో మెసేజ్ పోస్టు చేశారు. రాచకొండ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇటుకలు తయారీ చసేఉ్తన్న కార్మికుల పిల్లలకు వర్క్‌సైట్ స్కూళ్లను ప్రారంభించి విద్యనందించారు. పిల్లలు ఇటుక బట్టీల్లో బాలకార్మికులుగా పనిచేయొద్దని సంకల్పించిన సీపీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వర్క్‌సైట్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. ఈ విషయమై ఇటీవల అమెరికా పత్రికలో కథనం ప్రచురితమైంది. దానిపై స్పందించిన క్యాథరిన్ ట్విటర్లో రాచకొండ పోలీసుల కృషిని అభినందించి, ప్రశంసలు తెలియజేశారు.













