సీఎం కేసీఆర్ ను కలిసిన కామన్వెల్త్ విజేతలు
ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కామన్వెల్త్ విజేతలు కలిశారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ నెల 23న కామన్వెల్త్ విజేతలకు ఎల్బీ స్టేడియంలో సన్మానం, అభినందన సభ నిర్వహించనున్నారు. 5 రాష్ట్రాలకు చెందిన 18 మంది క్రీడాకారులు ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారని క్రీడాకారులను ముఖ్యమంత్రి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు.













