సీఎస్ ను కలిసిన సంసంతోష్బాబు భార్య
కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కటెక్టర్గా నేడు బాధ్యతలు చేపట్టారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి ఆమె జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. సంతోషి రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిరోజుల క్రితం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. కాగా, గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్‌బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో 20 మంది సైనికులు అమరలయ్యారు.













