ప్రభుత్వ పాఠశాలలకు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విరాళం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ ఇన్క్లూజన్లో భాగంగా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విరాళం ఇచ్చింది. మల్కాజ్గిరిలోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కుల్కు 500 ట్యాబ్లు, 50 ల్యాప్టాప్లను విరాళంగా అందజేసింది. దీని ద్వారా 9, 10వ తరగతి చదివే 500 మంది విద్యార్థులు, 50 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేసేందుకు కాగ్నిజెంట్ కోటి రూపాయలను కేటాయించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో డిజిటల్ నైపుణ్యాలు పెంపొందే విధంగా కంపెనీ వాలంటీర్లు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ హైదరాబాద్ ఆపరేషన్స్ శైలజా జ్యోసులా, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈవో మయూర్ పంతాల్, మేడ్చల్ మల్కాజ్గిరి డీఈవో ఐ విజయా కుమారి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం వీరేశం, తదితరులు పాల్గొన్నారు.













