మరో రెండు గ్యారెంటీల అమలుకు ముహూర్తం ఫిక్స్
మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గృహలక్ష్మీ, రూ.500కే సిలిండర్ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. మార్చి నెల నుంచి 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే వారికి జీరో బిల్లు వేయాలని అదేశించారు. గ్యాస్ సిలిండర్ సబ్బిడీ అర్హుల ఖాతాలో వేయాలా లేక ఏజెన్సీకి అనేదానిపై అధికారులు ఈజీ ప్రాసెస్ చేయాలని సూచించారు. సబ్సిడీ నిధులు వెంట వెంటనే చెల్లించే విధానం ఏర్పాట్లు చేయాలన్నారు. రేషన్ కార్డు, లేక ఇతర కారణాల వద్ద పథకాలకు దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం ఇస్తామని సీఎం పేర్కొన్నారు.













