సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రొటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ ఆధ్వర్యంలో అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేసి, విజయవంతంగా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మరో విమానంలో విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి శ్రీధర్‌బాబుకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సిగ్ రాజ్‌ఠాగూర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు.













