Sammakka Saralamma: సమ్మక్క-సారలమ్మ జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం (Medaram)లో జరిగే వనదేవతల మహాజాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి ఈ పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి 28-31 వరకు మేడారంలో సమ్మక్క-సారలమ్మ (Sammakka Saralamma) మహాజాతర జరగనుందన్నారు. జనవరి 28 సాయంత్రం 6 గంటలకు సారలమ్మ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెకు చేరుకుంటుంది. సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు వస్తారు. 29న సాయంత్రం 5గంటలకు సమ్మక్క చిలకల గుట్ట (Chilakala Gutta) నుంచి గద్దెలకు బయల్దేరుతుంది. 30న భక్తులకు వనదేవతలు గద్దెలపై కొలువై సంపూర్ణదర్శనం ఇస్తారు. 31న సాయంత్రం వనదేవతలు వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుందని వివరించారు. మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.






