ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం : సీఎం రేవంత్

ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహవారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.