CM Revanth Reddy: 2050 అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు : సీఎం రేవంత్

2050 నాటికి హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి(jalamandali) అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) (ఆదేశించారు. బోర్డు చైర్మన్ హోదాలో తొలిసారి సీఎం భేటీ అయ్యారు. గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టుపై అధికారులతో చర్చించారు. మల్లన్న సాగర్(Mallanna Sagar), కొండపోచమ్య సాగర్ (Kondapochamya Sagar) నుంచి నీటి సేకరణపై చర్చించారు. నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా 20 టీఎంసీలు తెచ్చుకునేలా మార్పులకు సీఎం ఆమోదం తెలిపారు. మంజీరా పైపులైన్‌కు అదనంగా ప్రత్యామ్నాయ పైపులైన్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.