వారి అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా సమగ్ర చట్టం : సీఎం రేవంత్

ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని, శాశ్వత పరిష్కారం చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్పులు, చేర్పులపై ప్రజాభిప్రాయం, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. వారి అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా సమగ్ర చట్టం తేవాలి. ధరణిపై అవసరమైతే అసెంబ్లీలో చర్చ చేపడదాం అని రేవంత్ అన్నారు.