CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (manmohan singh) పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) నివాళులర్పించారు. బెళగావి నుంచి నేరుగా ఢల్లీి వెళ్లిన సీఎం రేవంత్, అక్కడి నుంచి మన్మోహన్ నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ(Deepadas Munshi), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha), పలువురు ఎంపీలు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.