ముందడుగు వేయడమే తప్ప.. వెనక్కి తగ్గే ప్రసక్తేలేదు : సీఎం రేవంత్

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగు వేయడమే తప్ప, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే వెయ్యి సార్లు ఆలోచిస్తామని, తీసుకున్నాక వెనక్కి వెళ్లేది లేదన్నారు. నవంబరు 1న మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. తొలుత బాపూఘాట్ నుంచి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నవంబర్ లోపు ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
బీఆర్‌ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చు. బాపూఘాట్ నుంచి వెనక్కి 21 కి.మీ.అభివృద్ధి చేస్తాం. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోంది. విచారణ సమయంలో కక్ష సాధింపు ఉండదు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయి అని అన్నారు.