భువనగిరి నేతలతో సీఎం రేవంత్ సమావేశం

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21న నామినేషన్ వేయనున్న నేపథ్యంలో అదే రోజు భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం సూచించారు. మే తొలి వారంలో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని రేవంత్ తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజగోపాల్ రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు ముఖ్య నాయకులు హాజరయ్యారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సీఎం కోరారు.