స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. జీవితం కోసం క్రీడలు అనే నినాదంతో రూపుదిద్దుకున్న శాట్ కొత్త లోగో, డిజైన్ స్ఫూర్తిమంతంగా ఉందని సీఎం అభినందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శాట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్ ఎండీ సోనీ బాలా దేవి పాల్గొన్నారు.