సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఆరోగ్యశ్రీపై అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం పెంచాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఆర్‌ఎంపీ, పీఎంపీల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.