Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Cm revanth reddy handing over of appointment letters to newly recruited teachers through dsc 2024

ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు

  • Published By: techteam
  • October 9, 2024 / 09:16 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Cm Revanth Reddy Handing Over Of Appointment Letters To Newly Recruited Teachers Through Dsc 2024

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులంతా భవిష్యత్తు తరాలకు నిర్మాతలుగా అంకితభావంతో పని చేయాలని కోరారు. ఎల్బీ స్టేడియం వేదికగా DSC2024 రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు.

Telugu Times Custom Ads

భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ లాంటి ఎందరో మహామహులను తీర్చిదిద్దినవి  ప్రభుత్వ పాఠశాలలేనని ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని చెబుతూ, ఈ సందర్భంగా సీఎంగారు ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. “విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో బాధ్యతాయుతమైన భావి పౌరువులుగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మానవీయ విలువలతో మెలిగే భవ్య సమాజ నిర్మాణంలో నావంతు పాత్ర నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని డీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు ప్రతినబూనారు.

ప్రభుత్వ పాఠాశాల ప్రాధాన్యతను గుర్తించే ఇచ్చిన మాట ప్రకారం మీ కుటుంబాల్లో దసరా పండుగ సంతోషాలు నింపాలని నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోగా నియామకాలు పూర్తి చేశాం. ప్రభుత్వ రంగంలోని 30 వేల పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేటు రంగంలో 10 వేల పాఠశాలల్లో ఏకంగా 34 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటేనే నమోషీగా భావిస్తున్న పరిస్థితిపై అందరూ ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివామని గర్వంగా చెప్పుకునేలా ప్రైవేటు సంస్థలతో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నాం.

తొలిదశలో 5 వేల కోట్లు వెచ్చించి, 25 నియోజకవర్గాల్లో సకల వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌కు ఈనెల 11న శంకుస్థాపన చేయబోతున్నాం. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గారి సారథ్యంలోని విద్యా కమిషన్ చేసే సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేస్తాం. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించిన బదిలీలు, ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాం. ఎక్కడా చిన్న వివాదం లేకుండా 34 వేల మంది టీచర్లకు బదిలీలు చేయడంతో పాటు 21 వేల మందికి ప్రమోషన్లు కల్పించాం. తెలంగాణ భావితరాలను అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత యువతరం టీచర్లదే. ఆ టీచర్లకు కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది. యువత మాదకద్రవ్యాలకు, వ్యసనాలకు బానిసలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

 

 

 

 

 

 

Tags
  • Appointment Letters
  • CM Revanth Reddy
  • DSC 2024
  • Teachers

Related News

  • Vc Sajjanar Takes Charge As Hyderabad Cp

    Police Commissioner: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌

  • Cash Carrying Limit During Election Code Of Conduct

    Cash:ఒకరికి రూ.50 వేల వరకే అనుమతి … ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సీజ్

  • Tilak Varma Gets A Grand Welcome In Shamshabad Airport

    Tilak Verma:శంషాబాద్‌లో తిలక్‌ వర్మకు ఘన స్వాగతం

  • Telangana Bathukamma Celebration Sets Two Guinness World Records

    Bathukamma: ఘనంగా బతుకమ్మ వేడుకలు.. రెండు గిన్నిస్‌ రికార్డులు కైవసం

  • Minister Ponnam Prabhakar Key Comments On Release Of Local Election Schedule

    Minister Ponnam: స్థానిక సంస్థలకు తమ ప్రభుత్వం సిద్ధం :  మంత్రి పొన్నం ప్రభాకర్

  • Kcr Extends Saddula Bathukamma Greetings To Telangana People

    KCR: తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Latest News
  • YS Sharmila: చిచ్చు రేపిన షర్మిల.. హైకమాండ్ ఆగ్రహం..!?
  • Chiranjeevi: అందరివాడు చిరంజీవి..! విమర్శలు – పొగడ్తలు..!!
  • Police Commissioner: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌
  • Aishwarya Rajesh: ఫ్యాష‌న్ డ్రెస్ లో తెలుగమ్మాయి
  • Cash:ఒకరికి రూ.50 వేల వరకే అనుమతి … ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సీజ్
  • Tilak Verma:శంషాబాద్‌లో తిలక్‌ వర్మకు ఘన స్వాగతం
  • Prashant Kishore: రెండు గంటలు  సలహా ఇచ్చి.. రూ.11 కోట్లు  తీసుకున్నా : ప్రశాంత్‌ కిశోర్‌
  • Rammohan Naidu: ప్రగతి సంకల్పానికి ఇలాంటి ఉత్సవాలే ప్రేరణ :  కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
  • Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్
  • TTA: న్యూయార్క్‌లో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer