మోదీ-రేవంత్ మధ్య ఆసక్తికర సన్నివేశం

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరదాగా ముచ్చటించుకున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధానిని హస్తినకు సాగనంపే క్రమంలో సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నేత రాములు విమానం వద్ద పీఎం గురించి వేచి ఉన్నారు. అప్పుడే విమానం ఎక్కడానికి వస్తున్న పీఎం మోదీకి వీడ్కోలు చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేశారు. పుష్పగుచ్చం అందుకున్న ప్రధానికీ, సీఎం రేవంత్‌కు మధ్య ఏదో సరదా సంభాషణ జరిగింది. ఈ మాటలతో మోదీతో సహా అక్కడే ఉన్న సీఎం రేవంత్, మంత్రి, పొన్నం ప్రభాకర్, బీజేపీ నేత రాములు గట్టిగా నవ్వుకున్నారు.