యాదగిరీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ దంపతులు

యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయాన్ని వెళ్లారు. ఆలయ అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్, గీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు.