ప్రజాభవన్ లో బోనాల ఉత్సవాలు

ఆషాడ మాసం సందర్భంగా ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు న్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు స్వయంగా తీసుకువచ్చి శివసత్తులకు అందించారు.