Sarpanches: కొత్త సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు (Sarpanches) సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్‌లకు గుడ్ న్యూస్ (Good news) చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. పెద్ద గ్రామాలకు రూ. 10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు చొప్పున ఇస్తామన్నారు. సర్పంచ్‌లకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తామని తెలిపారు. అలాగే గ్రామాల్లో అర్హులందరికీ రేషన్ కార్డులు (Ration cards) జారీ చేస్తాని సీఎం ప్రకటించారు.
మీ సహకారం వల్లే నేను ఇంతటివాడిని అయ్యాను. 2009 నుంచి నన్ను మీ భుజాలపై మోశారు. కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాల్లో వివక్ష లేకుండా పరిపాలన సాగాలి. పార్టీలు, పంతాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలి. గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా సర్పంచ్‌లు ఉండాలి. ప్రజలకు ఉన్నతమైన, నాణ్యమైన సేవలు అందించాలి. పార్టీలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి కావాలి అని నూతన సర్పంచ్‌లకు సూచించారు.






