తప్పులు అంగీకరించకుండా ఎదురుదాడి : సీఎం రేవంత్ ఆగ్రహం
నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. నీటిపారుదల రంగంపై విపక్షాలు అభిప్రాయం చెప్పాయి. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదికనను సభ ముందు ఉంచుతున్నా. తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది. గత ప్రభుత్వం తప్పులు అంగీకరించి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది. వారు చేసిన తప్పులను అంగీకరించి సలహాలు ఇస్తే కొంతమేరకైకా సమాజం అభినందించేది. తప్పులు అంగీకరించకుండా ఎదురుదాడి చేస్తున్నారు. మంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే తప్పుల తడక అంటున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు.













