హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా.. అక్కున చేర్చుకుంటున్నాం : సీఎం రేవంత్

గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జెండా ఊపి ఫ్లై ఓవర్‌పైకి ఉమెన్ బైకర్‌ను అనుమతించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిది. తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోంది. హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. దేశం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి హైడ్రా వ్యవస్థను తీసుకువస్తున్నాం. మూసీని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తాం. గోపన్‌పల్లిలో ఎకరం రూ.100 కోట్లు పలుకుతోంది. ఇక్కడికి వచ్చిన ఐటీ, ఫార్మా సంస్థల వల్ల భూమి ధర పెరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు.