లోపల జరిగేది ఒకటి … బయట చెప్పేది ఇంకొక్కటి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడయం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కోతల రాయుడు ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పాం. వంగి.. వంగి..పొర్లి దండాలు పెట్టినా మేము క్షమించం. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు చావు దెబ్బ కొట్టారు. లోపల జరిగేది ఒకటి. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటి. వరదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదు. కాలేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం. కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారు. ప్రశ్నిస్తే మా రాష్ట్రం.. మా నిధులంటారు.. రాష్ట్రం మీ అయ్యా జాగీరా అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.













