రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు సీఎం కేసీఆర్ స్వాగతం
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి ఈరోజు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. రాష్ట్రపతికి శాలువా కప్పి పూల బొకే అందించి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, సిహెచ్ మల్లారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, నవీన్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.













