యాదాద్రి దర్శించుకున్న సీఎం కేసీఆర్
యాద్రాది శ్రీలక్ష్మినరసింహ స్వామివారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి ముందుగా ఓ వివాహానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుంగ బాలు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం యాదగిరిగుట్ట చేరుకొని యాదగిరీశుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం జరుగుతోందని వైటీడీఏ, ఆలయ ఆధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.













