సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన….

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో మరో సంచలన ప్రకటన చేశారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వరంగల్ ఎంజీఎంను కూలుస్తామన్నారు. పాత భవనాలన్నింటినీ నేలమట్టం చేస్తామని ప్రకటించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‍ఎంల సేవలు మరువలేనివన్నారు. వారికి చేతులెత్తి మొక్కుతున్నానన్నారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సెల్యూట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓవర్ లోడ్ ఉన్నా, వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని అభినందించారు. కరోనా విషయంలో మీడియా సంయమనం పాటించాలన్నారు. టీవీలో భయపెట్టే వార్తలు చూసి చనిపోయారని ప్రధానే తనకు చెప్పారన్నారు. భయోత్పాతం సృష్టించడం వల్ల భయంకరమైన దుష్పరిణామాలు సంభవిస్తాయన్నారు.