బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. కార్యాలయాన్ని పరిశీలించిన కేసీఆర్ పలు సూచనలు చేశారు. యాగం, పూజలు జరుగుతున్న ప్రదేశాలను కేసీఆర్ సందర్శించారు. అనంతరం సర్దార్ పటేల్ మార్గ్ నుంచి వసంత్ విహార్‌కు వెళ్లారు సీం. అక్కడ నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ భవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. అన్ని ఫ్లోర్లను కలియ తిరిగి పలు సూచనలు చేశారు కేసీఆర్. ముఖ్యమంత్రి వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.













