మరోసారి ఏపీకి సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. వచ్చే నెల 10న విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఇటీవల ఎర్రవల్లిలో ఐదురోజుల పాటు సహస్ర చండీ యాగాన్ని కేసీఆర్ నిర్వహించారు. శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి యాగానికి హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాల్సిందిగా కేసీఆర్‌ను స్వరూపానంద స్వామి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 14న ముఖ్యమంత్రి విశాఖ వెళ్లి శారాదా పీఠాన్ని సందర్శించనున్నారు. అక్కడ జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిపి పాల్గొంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు.













