మే 2న సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మే 2న ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు, నాలుగు రోజులపాటు అక్కడే ఉండనున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అందుబాటులో ఉన్న జాతీయ నేతలను కలిసి చర్చించనున్నారు. నాలుగో తేదీన ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని సందర్శించి పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవాన్ మాన్‌సింగ్‌తో పాటు ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందిన నిష్టాతులు, పలువురు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌లను కలవనున్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్న్యాయంగా కూటమి ఏర్పాటు చేసే దిశగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలో భాగంగా కేసీఆర్ సైతం ఈ అంశంపై జాతీయస్థాయి నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.













