దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ పార్కు : కేటీఆర్
దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ పార్కుకు తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంతా సిద్దం చేస్తుంది. ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరంగల్లో కాకతీయ టెక్స్టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు అవుతుందన్నారు. గ్రామీణ వరంగల్ జిల్లా శాయంపేట, చింతపల్లి గ్రామాల పరధిలో మొత్తం 200 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పైబర్ టూ ఫ్యాషన్ అంటే నూలు పోగు నుంటి బట్ట తయారీ వరకు కావాల్సిన అధునాత వసతులను ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన పత్తి దిగుబడి అయ్యే ప్రాంతాలకు చేరువగా ఈ పార్కు ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న టెక్స్టైల్ పరిశ్రమలు ప్రపంచ స్థాయి ప్రమాణాలో ఏర్పడనున్నాయన్నారు. ఈ పార్కులో దుస్తుల తయారీకి అవసరం అయిన ప్లగ్ అండ్ ప్లే ఫ్యాక్టరీ షెడ్లును సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్కు ఏర్పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలతో ఒక ముందడుగన్నారు. దీంతో పాటు టెక్స్టైల్స్ పరిశ్రమలో తెలంగాణకు ఉన్న సంప్రదాయక నైపుణ్యాలను ఆదునిక సాంకేతిక సొబగులు అద్దడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచినట్టవుతుందన్నారు.













