ఈ నెల 14న తెలంగాణ కేబినెట్ భేటీ ?
తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 14 లేదా 15వ తేదీన జరిగే అవకాశముంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం సహచరులతో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిస్థితులపై సీరియస్గా మథనం చేయడంతో పాటు భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ భేటీలో పంటల సాగుపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు 70 వేల పోస్టుల నియామకానికి పచ్చ జెండా ఊపే ఛాన్స్ ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిపై కేబినెట్లో చర్చించనున్నారు. వరి ధాన్యం కొనుగోలుపై భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇతర పంటలవైపు రైతులను ప్రోత్సహించేందుకు రాయితీలు కూడా ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇటు దళిత బంధుపై కూడా కేబినెట్ మరోసారి చర్చించే అవకాశముంది. 199 నియోజకవర్గల్లో వందమందికి దళిత బంధు సాయం అందేలా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.













