దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ?
దసరా రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. దీని కోసం ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దసరా రోజునే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుందని సమాచారం. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ, ఎంపీల ఏకాభిప్రాయంతో కేసీఆర్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేయనున్నారు. ఈ బహిరంగ సభలో పార్టీ జెండా, ఎజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారని సమాచారం. ఇక పార్టీకి సంబంధించిన జెండా రూపకల్పన విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. భారతదేశ చిత్ర పటంతో పాటు గులాబీ రంగు సైతం కేసీఆర్ జాతీయ పార్టీ జెండాలో మిళితమై ఉంటుందని తెలుస్తోంది. ఇక పార్టీ ఎజెండా విషయానికి వస్తే రైతులు, దళితులు, యువతను టార్గెట్ చేయనున్నట్టు సమాచారం. ఇక పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి అని టాక్ నడుస్తోందని కానీ క్లారిటీగా ఇదే అన్న విషయం మాత్రం తెలియడం లేదు. మొత్తానికి దసరాతో సస్పెన్స్ వీడే అవకాశం ఉంది.













