పోడు పట్టాల పంపిణీ ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి తీసుకొచ్చిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కుమురం భీం`ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గ ఆదివాసీలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. పోడు పట్టాలు పొందిన ఆదివాసీలకు రైతుబంధు చెక్కులను సైతం అందించారు. ఈ సంరద్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పోడు పట్టాలన్నింటినీ మహిళల పేరు మీదే అందిస్తున్నామని, రెండు మూడు రోజుల్లో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,51,000 మంది రైతులకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నాం. ఈ పోడు విషయంలో గిరిజన రైతులకు కాకుండా గిరిజనులు కానివారు కూడా ఉన్నారు. అయితే 75 ఏళ్లుగా వారు ఒక చోట నివాసముంటున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒక ప్రక్రియను తీసుకొస్తాం. త్వరలోనే పనులు పూర్తి చేసి వారికి కూడా న్యాయం చేస్తామన్నారు.
గతంలో అడవులను ఆక్రమించారని కొంతమంది గిరిజనుల మీద కేసులు నమోదయ్యాయి. వారిమీద నమోదు చేసిన చేసులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించాం. అందుకోస అనుసరించాల్సిన ప్రక్రియపై సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తాం. జిల్లాలోని మారుమాల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు ఇకపై 3ఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటా. గిరివికాసం కింద బోర్లు వేసుసుకునేందుకు అవకాశం కల్పిస్తాం అని కేసీఆర్ వెల్లడిరచారు.













