వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకుండా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలన్నారు. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దోషులు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలన్నారు. దీని అమలు కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్, వెయ్యి మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వ్యవస్థీకృత నేరాలను కఠినంగా నియంత్రించాలన్నారు. ఈ నెల 28న స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని సీఎం నిర్ణయించారు.













