అల్లా దయతో తెలంగాణ : సీఎం కేసీఆర్
అల్లా దయతో తెలంగాణ సిద్ధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇస్తున్న ఈ ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని, హరీశ్ రావు, తలసాని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం.. పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లను కేటాయించినట్లు కేసీఆర్ తెలిపారు.













