గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తిని రేకెత్తించింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండడంతో సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎస్‌తో పాటు రాజ్‌భవన్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆపై ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. అయితే భేటీ సారాంశం అధికారికంగా బయటకు రాకపోయినా, గవర్నర్‌తో ప్రత్యేక భేటీలో పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ జరిగినట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న బిల్లులపైనా సీఎం కేసీఆర్ గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లు సమాచారం.













